రాచమల్లు తరువాత రాచపాళెం

రాచపాలెంను సత్కరిస్తున్న జనవిజ్ఞాన వేదిక, సాహితీ స్రవంతి సభ్యులు

రాచమల్లు తరువాత రాచపాళెం

కడప: ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి శైలి విలక్షణమని విమర్శల్లో రాచమల్లు తరువాత రాచపాళెం అని జిల్లా సాహితీవేత్తలు కొనియాడారు.

మన నవలలు, మన కధానికల పుస్తకానికి గాను చంద్రశేఖర్‌ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా జిల్లా జనవిజ్ఞానవేదిక సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు.

ఇందులో భాగంగా జవివే కార్యదర్శి రఘునాధరెడ్డి, సాహితీ స్రవంతి అధ్యక్షుడు మస్తాన్‌వలి, సాహితీ వేత్తలు శశిశ్రీ, ఎంఎం వినోది ని తదితరులు రాచపాళెం సాహితీ కృషిని విఫులీకరించారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు.

చదవండి :  మే ఒకటో తేదీ నుంచి 31 వరకు జిల్లా కోర్టుకు వేసవి సెలవులు

కార్యక్రమంలో పెద్దఎత్తున సాహితీ ప్రముఖులు, విద్యావేత్తలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *