
మేదిని జీవులఁగావ మేలుకోవయ్యా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మేదిని జీవులఁగావ మేలుకోవయ్యా నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥చ1॥ తగుగోపికల కన్నుఁదామరలు వికసించె మిగుల సూర్యనేత్రుఁడ మేలుకోవయ్యా తెగువ రాక్షసులనే తిమిరము విరియఁగ నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ॥చ2॥ ఘనదురితపు నల్లఁగలువలు వికసించె మినుకు శశివర్ణుఁడ మేలుకోవయ్యా పనివడి వేదాలనే పక్షులెల్లాఁ బలుకఁగ జనక యాశ్రితపారిజాత మేలుకోవయ్య ॥చ3॥ వరలక్ష్మికుచచక్రవాకము లొండొంటి రాయ మెరయు దోషారహిత మేలుకోవయ్యా పొరసి నీవు నిత్యభోగములు భోగించ నిరతి శ్రీవేంకటేశ నేఁడు మేలుకోవయ్యా |
రాగము: భూపాళం రేకు: 0079-02 సంపుటము: 1-377 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భూపాళం