
ముందటిజన్మములెల్లా ముంచెఁ బారుబడివడ్డి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ముందటిజన్మములెల్లా ముంచెఁ బారుబడివడ్డి యెందు చొచ్చినానుఁ బోనియ్య దీరుణము ॥చ1॥ నుదుట వ్రాసినవ్రాలు నూరేండ్లపత్రము పొదలు నాకర్మమే పూఁటకాఁపు వెదకి సంసారము వెంటఁ బైతరవు యిది యెందుచొచ్చినాఁ బోనియ్య దీరుణము ॥చ2॥ పుట్టినప్పుడే తనువు భోగ్యమై నిలిచెను జట్టిఁ గామినులపొందు సరియాఁకలు నెట్టన యాహరములు నిచ్చినిచ్చ లంచాలు దిట్టనై యెందు చొచ్చినాఁ దీర దీరుణము ॥చ3॥ యెక్కువైనశ్రీవేంకటేశుమఱఁగు చొచ్చి తెక్కుతోడ సలిగెల దిరుగఁగను అక్కరతో నప్పులెల్లా నవి మాకుఁ దామచ్చి చిక్కి యెందు చొచ్చినాఁ జేరు నీరుణము |
రాగము: గుండక్రియ రేకు: 0094-05 సంపుటము: 1-469 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ