
ముంచినవేడుకతోడ మొక్కుటగాక – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ముంచినవేడుకతోడ మొక్కుటగాక కంచములోపలికూడు కాలఁదన్న నేఁటికి ॥చ1॥ వేదార్థములు నీవేవిహరించినసుద్ధులే కాదని అవునని కొన్ని వాదములేల యేది నీవు సేసినాను యిన్నియును నియ్యకోలే సోదించనేఁటికి యందు సొట్టు లెంచఁనేటికి ॥చ2॥ కర్మము లిన్నియును నీకైంకర్యసాధనాలే అర్మిలిఁ దారతమ్యము లడుగనేల నిర్మితము నీ దింతే నెరసు లెంచంగనేల ధర్మమందు నింక గజదంతపరీక్షేఁటికి ॥చ3॥ భక్తియింతా నొక ఘంటాపథము నీశావలే యుక్తిఁ బాత్రాపాత్రములు యూహించనేల ము క్తికి శ్రీవేంకటేశ మూలము నీపాదములు సక్తులయి నమ్ముటగాక చలపదమేఁటికి |
రాగము: సాళంగనాట రేకు: 0099-03 సంపుటము: 1-497 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగనాట