మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా – అన్నమయ్య సంకీర్తన

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా
సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా
॥చ1॥
ఆవులు పేయలకుఁగా నఱచీఁబిదుకవలె
గోవిందుఁడ యింక మేలుకొనవయ్యా
ఆవలీవలి పడుఛు లాటలు మరిగివచ్చి
త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా
॥చ2॥
వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁ
గూడియున్నా రిదే మేలుకొనయ్యా
తోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకము
యీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యా
॥చ3॥
పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె కన్నుఁ
గొలుకులు నిచ్చి మేలుకొనవయ్యా
అలరిన శ్రీవేంకటాద్రిమీఁది బాలకృష్ణ
యిల మామాటలు వింటి విఁక మేలుకోవయ్యా
రాగము: భూపాళం
రేకు: 0078-05
సంపుటము: 1-374

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భూపాళం

చదవండి :  అది నాయపరాధ మిది నాయపరాధ - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: