మాయపుదనుజులమదవైరి కపి- – అన్నమయ్య సంకీర్తన

మాయపుదనుజులమదవైరి కపి- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
మాయపుదనుజులమదవైరి కపి-
రాయఁడు వీఁడివో రామునిబంటు
॥చ1॥
పెట్టిన జంగయు పెంపుమిగుల మొలఁ
గట్టినకానెయు గర్వమున
నిట్టనిలిచి పూనినచేత నడిమి-
దిట్ట వీఁడువో దేవునిబంటు
॥చ2॥
నవ్వుచు లంకానగరపుదనుజుల-
కొవ్వణఁచినకపికుంజరుఁడు
మువ్వురువేల్పుల మొదలి భూతియగు-
రవ్వగు సీతారమణునిబంటు
॥చ3॥
పంకజసంభవుపట్టముగట్టను
వుంకించిన తనవొడయనిచే
పొంకపుకలశాపురహనుమంతుఁడు
వేంకటరమణుని వేడుకబంటు
రాగము: సామంతం
రేకు: 0045-06
సంపుటము: 1-279

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  మానఁ డెన్నఁడు శరీరి దు- - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *