భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను – అన్నమయ్య సంకీర్తన

భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను
తీరని చేఁదేకాక తియ్యనుండీనా
॥చ1॥
పాయఁదీసి కుక్కతోఁక బద్దలువెట్టి బిగిసి
చాయ కెంత గట్టిగాను చక్కనుండీనా
కాయవు వికారమిది కలకాలముఁ జెప్పినా
పోయిన పోకలేకాక బుద్ది వినీనా
॥చ2॥
ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేఁడు మెత్తనయ్యీనా
పంచమహాపాతకాల బారిఁబడ్డ చిత్తమిది
దంచిదంచి చెప్పినాను తాఁకి వంగీనా
॥చ3॥
కూరిమితోఁ దేలుఁదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారెసారెఁ గుట్టుగాక చక్కనుండీనా
వేరులేని మహిమల వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుకోర సోఁకీనా
రాగము: దేవగాంధారి
రేకు: 0047-02
సంపుటము: 1-287

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి

చదవండి :  సతతవిరక్తుఁడు సంసారి గాఁడు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *