
బ్రువంతి బౌద్దా బుద్ద ఇతి
॥పల్లవి॥ బ్రువంతి బౌద్దా బుద్ద ఇతి స్తువంతి భక్తా సులభ ఇతి ॥చ1॥ గదంతికిల సాంఖ్యాస్త్వాం పురుషం పదవాక్య జాః పదమితిచ విదంతి త్వా వేదాంతిన- స్సదా బ్రహ్మ లసత్పదమితిచ ॥చ2॥ జపంతి మీమాంసకా స్త్వాం చ విపులకర్మణో విభవ ఇతి లపంతి నయసకలా స్సతతం కృపాళుకుర్తా కేవలమితిచ ॥చ3॥ భణంతి వేంకటపతే మునయో- హ్యణిమాదిప్రద మతులమితి గుణవంతం నిర్గుణం పునరితి గృణంతి సర్వే కేవలమితిచ |
రాగము: సామంతం రేకు: 0027-03 సంపుటము: 1-164 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం