బీఎస్ఎన్ఎల్‌కు జిల్లాలో రూ.13 కోట్ల నష్టం

బీఎస్ఎన్ఎల్‌కు జిల్లాలో రూ.13 కోట్ల నష్టం

ఇదే కొనసాగితే ప్రైవేటుకు అప్పగించినా ఆశ్యర్యపోనవసరం

పులివెందుల: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సంస్థను లాభాలబాట పట్టించేందుకు ఉద్యోగులంతా కృషి చేయాలని జీఎం శివశంకరరెడ్డి సూచించారు. సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులతో సమావేశం అయిన ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా సంస్థకు గత ఏడాది రూ.785కోట్లు నష్టం వస్తే జిల్లాలో రూ.13 కోట్ల నష్టం వచ్చిందన్నారు.

ఇదే కొనసాగితే భవిష్యత్తులో జీతాలు కూడా ఉండవన్నారు. వసతులూ నిలిపేస్తూ ప్రైవేటు సంస్థకు నిర్వహణ అప్పగించినా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పారు. ల్యాండ్‌ఫోన్ల పునరుద్ధరణతో వినియోగదారుల్లో నమ్మకం పెంచుకోవాలని వివరించారు. సిమ్‌కార్డుల అమ్మకాలు పెంచాలని కోరారు. ల్యాండ్‌ఫోన్లు సరిగా పనిచేయడం లేదని ఈ సందర్భంగా వినియోగదారులు ఆయనకు ఫిర్యాదు చేశారు. వాటిని వెంటనే రిపేరు చేసి సేవలు పునరుద్ధరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చదవండి :  జిల్లాపై వివక్ష తగదు : సీపీఎం

ఇకనైనా బీఎస్ఎన్ఎల్ సేవలు మెరుగుపడితే అదే వినియోగదారులకు పదివేలు. ఇప్పటికైనా ఉద్యోగులు మేల్కొంటారా?

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: