
ప్రాణులనేరమి గాదిది బహుజన్మపరంపరచే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ప్రాణులనేరమి గాదిది బహుజన్మపరంపరచే ప్రాణులు సేసిన తమతమ పాపఫలము గాని read ॥చ1॥ హరి సకలవ్యాపకుఁడని అందరుఁ జెప్పఁగ నెరిఁగియు పరదైవంబులఁ గోలువకపాయరు మానవులు నరపతి భూమేలఁగ భూవరు భజియింపఁగనొల్లక పరిసరవర్తులబెంబడిఁ బనిసేనినయట్లు ॥చ2॥ పొందుకు తమతమ సేసినపూజలు మ్రొక్కులు గైకొను అందముగాఁ బురుషాత్తముఁ డాతఁడే కలఁడనియు అందరు నెరిఁగియు యితరులఁ జెందుదురున్నత శైలము నందక చేరునతరువుల నందుకొనినయట్లు ॥చ3॥ శ్రీ వేంకటపతి యొక్కఁడె చెప్పఁగ జగములకెల్లను దైవము నాతుమలోపలిధనమనఁగా వినియు సేవింపరు పామరు లీదేవుని మధురంబొల్లక వావిరిఁ బులుసులు చేఁదులు వలెనని కొనునట్లు |
రాగము: గుండక్రియ రేకు: 0069-05 సంపుటము: 1-362 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ