పోయఁ బోయఁ గాలమెల్ల గాలమెల్ల పూఁట పూఁటకు – అన్నమయ్య సంకీర్తన

పోయఁ బోయఁ గాలమెల్ల గాలమెల్ల పూఁట పూఁటకు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పోయఁ బోయఁ గాలమెల్ల గాలమెల్ల పూఁట పూఁటకు
రోయనిరోఁతలు చూచి రుచి చూరఁబోయ
॥చ1॥
తాడిమానెక్కేటివాని తడయక పట్టిపట్టి
తోడఁదోడ నెందాఁకాఁ దోయవచ్చును
కాడువడ్డ చిత్తమిది కలకాలము నిట్టే
ఆడికెలకులోనై తనియక పోయ
॥చ2॥
మన్నుదినియేటిదూడ మానుమంటా మొత్తిమొత్తి
కన్నిగట్టి యెందాఁకఁ గాయవచ్చును
సన్నపుటాసలమీఁదిచరిఁబడ్డదేహమిది
కన్నపుఁగత్తులచూపు కట్టరాకపోయ
॥చ3॥
హేయము దొక్కకుమన్న యేచి తినేననేవాఁడు
చాయకు రాకున్న నేమిసేయవచ్చును
మాయలవేంకటపతి మచ్చుచల్ల నాయాత్మ
పాయక యాతనిఁజేరి భయమెల్లఁ బోయ
రాగము: దేసాక్షి
రేకు: 0034-01
సంపుటము: 1-208

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాక్షి

చదవండి :  పోయఁ గాలం బడవికిఁ గాయు వెన్నెలకరణిని

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *