పొరాక పోయి తలఁపుననున్న దైవంబుఁ – అన్నమయ్య సంకీర్తన

పొరాక పోయి తలఁపుననున్న దైవంబుఁ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పొరాక పోయి తలఁపుననున్న దైవంబుఁ
జేరనొల్లక పరులఁజేరఁదిరగెదము
॥చ1॥
వడిఁబారు పెనుమృగము వలలలోపలఁ దగులు
వడి వెడల గతిలేక వడఁకుచున్నట్లు
చెడనికర్మములలోఁ జిక్కి భవములబాధఁ
బడియెదముగాక యేపనికిఁ దిరిగెదము
॥చ2॥
నీరులోపలిమీను నిగిడి యామిషముకై
కోరి గాలము మ్రింగి కూలబఁడినట్లు
జారిపోయిననేల సంసారసౌఖ్యవి-
కారంపుమోహములఁ గట్టువడియెదము
॥చ3॥
శ్రీవేంకటేశు నాశ్రితలోకరక్షకుని
భావింప దేవతాపతియైనవాని
సేవించుభావంబు చిత్తమొడఁబడక నే-
మీవలావలిపనుల నిట్లఁ దిరిగెదము
రాగము: గుండక్రియ
రేకు: 0064-04
సంపుటము: 1-331

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ

చదవండి :  పనిలేని ధనవాంఛఁ బడిపొరలిన నిట్టి -

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: