సోమవారం , 23 డిసెంబర్ 2024

పల్లె పల్లెకు పోతా…

చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన పలు హామీలను గడగడపకూ తెలిపెందుకు మాజీ ఎమ్మెల్సీ పుత్తా నర్సింహారెడ్డి కమలాపురం నియోజకవర్గ పరిధిలో ‘పలెపల్లెకు పుత్తా’ కార్యక్రమం ఈరోజు ఆరంభించనున్నారు.

puttaనియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోఅక్కడి మండల, గ్రామస్థాయి నాయకులు నిత్యం కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని వాటిలో ప్రతి ఇంటికీ వెళ్లి బాబు వాగ్దానాలపై ప్రచారం చేయనున్నట్లు పుత్తా నర్సింహారెడ్డి తెలిపారు.

బాబు గారి హామీల్లో ముఖ్యమైన బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు, బంగారు రుణాలురద్దు, సాగు, తాగునీరు సరఫరా, డ్వాక్రా రుణాల మాఫీ, వృద్ధులు, వితంతువులకు రూ. 600 పింఛను, నిరుద్యోగులకు రూ. 1,000 పింఛనుపైఅందరికీ వివరిస్తామని పుత్తా చెబుతున్నారు.

చదవండి :  జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఇంతకీ ఈ కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేయబోతున్నారు? వాటికి నిదులేక్కడి నుండి తెస్తారు? ఆయా పధకాలు లేదా హామీల అమలు సాధ్యమా అన్న విషయాన్ని కూడా నరసింహారెడ్డి గారు వివరిస్తే బాగుంటుందేమో!

లేదంటే ఇవన్నీ బాబు మార్కు ఉచిత హామీలే అని జనాలు పెడచెవిన పెడతారేమో?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: