పరులసేవలు చేసి బ్రదికేరటా – అన్నమయ్య సంకీర్తన

పరులసేవలు చేసి బ్రదికేరటా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పరులసేవలు చేసి బ్రదికేరటా
సిరివరుదాసులు సిరులందు టరుదా
॥చ1॥
కోరి వొక నరునిఁ గొలిచిన వారలు
దీరులై సలిగెలఁ దిరిగేరట
కూరిమి బ్రహ్మండ కోటులేలెడివాని-
వార లింతటఁ జనవరులౌ టరుదా
॥చ2॥
చేకొన్న తుమ్మిద చేపడ్డ కీటము –
లాకడఁ దుమ్మిదలయ్యీనట
శ్రీకాంతుని పాదసేవకులగు వార –
లేకులజు లయినా నెక్కుడౌ టరుదా
॥చ3॥
ధరణీశు నాజ్ఞల తమదేశములందు
సిరులనాణెపు ముద్ర చెల్లీనట
తిరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలు
ధరియింపఁగా నింతటఁ జెల్లు టరుదా
రాగము: దేసాళం
రేకు: 0081-03
సంపుటము: 1-390

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాళం

చదవండి :  ఎంతైన దొలఁగవై తేదైన నామతికి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: