పరమాత్ముని నోరఁబాడుచును యిరు-

పరమాత్ముని నోరఁబాడుచును యిరు-

॥పల్లవి॥
పరమాత్ముని నోరఁబాడుచును యిరు-
దరులు గూడఁగఁ దోసి దంచీ మాయ
॥చ1॥
కొలఁది బ్రహ్మాండపు కుందెనలోన
కులికి జీవులను కొలుచు నించి
కలికి దుర్మోహపు రోఁకలివేసి
తలంచి తనువులను దంచీ మాయ
॥చ2॥
తొంగలి రెప్పలు రాత్రులుఁ బగలును
సంగడి కనుఁగవ సరిఁ దిప్పుచు
చెంగలించి వెసఁ జేతులు విసరుచు
దంగుడు బియ్యముగా దంచీ మాయ
॥చ3॥
అనయముఁ దిరు వేంకటాధీశ్వరుని
పనుపడి తనలోఁ బాడుచును
వొనరి విన్నాణి జీవులనెడి బియ్యము
తనర నాతనికియ్య దంచీ మాయ
రాగము: కేదారగౌళ
రేకు: 0021-06
సంపుటము: 1-130

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, కేదారగౌళ

చదవండి :  కిం కరిష్యామి కిం కరోమి బహుళ- - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: