పరమపాతకుఁడ భవబంధుఁడ శ్రీ –
॥పల్లవి॥ పరమపాతకుఁడ భవబంధుఁడ శ్రీ – హరి నినుఁ దలఁచ నే నరుహుఁడనా ॥చ1॥ అపవిత్రుఁడ నే నమంగళుఁడఁ గడు- నపగతణ్యుఁడ నలసుఁడను కపటకలుషపరికరహృదయుఁడ నే- నపవర్గమునకు నరుహుఁడనా ॥చ2॥ అతిదుష్టుఁడ నే నధికదూషితుఁడ హతవివేకమతి నదయుఁడను పతిలేని రమాపతి మిముఁదలఁచలే నతులగతికి నే నరుహుఁడనా ॥చ3॥ అనుపమవిషయపరాధీనుఁడ నే- ననంతమోహభయాతురుఁడ వినుతింపఁగ దిరువేంకటేశ ఘను- లనఘులుగాక నే నరుహుఁడనా |
రాగము: సామంతం రేకు: 0005-04 సంపుటము: 1-33 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం