
పనిమాలినట్టి వట్టి పఱఁదుగాక మాకు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పనిమాలినట్టి వట్టి పఱఁదుగాక మాకు ననిచి యిదియు నొక్కనగుఁబాట్లా ॥చ1॥ కన్నవారినెల్లా వేఁడేకష్టమే దక్కుటగాక పన్ని దైవమియ్యనిది పరులిచ్చేరా యెన్నికతోఁ దేహమిచ్చె నిహమెల్లాఁ జెందనిచ్చె వున్నవారింతటి పని కోపఁగలరా ॥చ2॥ బడలి తానెందైనాఁ బడ్డపాటే దక్కెఁగాక కడఁగి రానిది దే నొక్క రివసమా కడుపులో నుండఁగానే కలవి నుదుట వ్రాసె తడవి దైవముచేఁత దాఁట వసమా ॥చ3॥ దెప్పరపు సంపదకుఁ దిమ్మటలే దక్కెఁగాక యెప్పుడూ శ్రీవేంకటేశుఁడీక మానీనా చప్పుడుగా నతనికే శరణన్న జాలుఁగాక తప్పులును వొప్పులు నాతనివే కావా |
రాగము: సాళంగం రేకు: 0081-02 సంపుటము: 1-389 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగం