పట్టవసముగానిబాలుఁడా పెనుఁ-
॥పల్లవి॥ పట్టవసముగానిబాలుఁడా పెనుఁ- బట్టపు బలువుఁడ బాలుఁడా lisinopril and driving lisinopriland.net lisinopril and driving ॥చ1॥ ఇరుగడ బహ్మయు నీశ్వరుఁడును నిన్ను సరుస నుతింప జఠరమున అరుదుగ నుండి ప్రియంబున వెడలిన- పరమమూర్తివా బాలుఁడా ॥చ2॥ తల్లియుఁ దండ్రియుఁ దనియనిముదమున వెల్లిగ లోలో వెఱవఁగను కల్లనిదురతోఁ గనుమూసుక రే- పల్లెలోఁ బెరిగిన బాలుఁడా ॥చ3॥ యేదెసఁ జూచిన నిందరి భయముల- సేదలు దేఱఁగఁ జెలగుచును వేదపల్లవపు వేంకటగిరిపై పాదము మోపిన బాలుఁడా |
రాగము: భైరవి-రచ్చెతాళం రేకు: 0009-04 సంపుటము: 1-58 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భైరవి-రచ్చెతాళం