నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు – అన్నమయ్య సంకీర్తన

నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు
నీవనుచుఁ గనుఁగొన్న నిజమెల్ల నీవే
॥చ1॥
తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల –
ననయంబుఁ గనుఁగొన్నయతఁడే నీవు
తనుఁగన్న తల్లిఁగా తగనితరకాంతలను
ఆనఘఁడై మదిఁజూచునతఁడే నీవు
॥చ2॥
సతతసత్యవ్రతాచారసంపన్నుఁడై
ఆతిశయంబుగ మెలఁగునతఁడే నీవు
ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు-
హతకాముకుఁడైనయతఁడే నీవు
॥చ3॥
మోదమున సుఖదు:
నాదరింపుచునున్న యతఁడే నీవు
వేదోక్తమతియైన వేంకటాచలనాథ
ఆదియును నంత్యంబు నంతయును నీవే
రాగము: సామంతం
రేకు: 0038-02
సంపుటము: 1-232

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  ఎంతనేయఁగలేదు యిటువంటివిధి యభవు-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *