
నీయాజ్ఞ దలమోచి నీ దేహధారి నైతి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నీయాజ్ఞ దలమోచి నీ దేహధారి నైతి యీయేడ గోవిందుఁడ నే నీడేరేదెట్లో read ॥చ1॥ తనువు వేసరినాను తలఁపు వేసరదు ధనముగడించెడితరితీపున చెనకి మగఁడు విడిచిన మామ విడువని- పనియాయ హరి నాబదుకుజాడ యెట్లో ॥చ2॥ పాయము ముదిసిననాను భావము ముదియదు వేయైనా సంసారవిషయాలను వోయయ్య కలివోసినావుట్లదిక్కు చూచేది మాయదాయ నిఁక నామనసుజాడెట్లో ॥చ3॥ కడలేనినావిధులు కన్నులారఁ జూచి నీవు నడుమ శ్రీవేంకటేశ నన్ను నేలితి నొడుగులు దప్పినాను నోముఫలము దప్పని- అడియాల మబ్బె నాకు నానతిచ్చి తెట్లో |
రాగము: రామక్రియ రేకు: 0079-01 సంపుటము: 1-376 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ