
దేవదేవుడెక్కె నదె దివ్వరథము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ దేవదేవుడెక్కె నదె దివ్వరథము మావంటి వారికెల్ల మనో రథము ॥చ1॥ జగతి బాలులకై జలధులు వేరఁ జేసి పగటునఁ దోలెనదె పైఁడి రథము మిగులఁగఁ గోపగించి మెరయురావణమీఁద తెగి యెక్కి తోలేనదె దేవేంద్రర థము ॥చ2॥ దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకుఁ బక్కన మరలిచెఁ బుష్పక రథము నిక్కి నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె వెక్కసపు రెక్కలతో విష్ణు రథము ॥చ3॥ బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె అలయేఁగు బెండ్లికల్యాణ రథము యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి కలకాలమును నేగె ఘనమైన రథము |
రాగము: సాళంగనాట రేకు: 0083-02 సంపుటము: 1-400 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగనాట