దురితదేహులే తొల్లియును శ్రీ-
॥పల్లవి॥ దురితదేహులే తొల్లియును శ్రీ- హరి భజించి నిత్యాధికులైరి go mebendazol dosierung mebendazol overdosering ॥చ1॥ అనంతకోటి మహామునులు ఈ- సనకాదులు నిశ్చలయశులు ఇనశశినయనుని నితనిని మును గని భజించి గత కల్మషులైరి ॥చ2॥ అతిశయమతులు మహామహులు సుఖ- రతి విముఖులును చిరంతనులు హిత విచారమతి నితనిని సం- తతమును భజించి ధన్యులైరి ॥చ3॥ దేవతాధిపులు దివ్యులును కడుఁ- బావనులును తగ బరహితులు యీ వేంకటపతి నితనిని సేవించి సుఖాంచితమతులైరి |
రాగము: శుద్ధవసంతం రేకు: 0004-01 సంపుటము: 1-21 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శుద్ధవసంతం