ప్రొద్దుటూరు: మైదుకూరు పట్టణంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసి గాయపరచిన కేసు(క్రైం నెంబరు 97/2013)లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 35మందిని ఐపిసిలోని 147,148,448,427,324,379,307,153-A, 143 రెడ్ విత్ 149 సెక్షన్లతో పాటుగా మారణాయుధాల చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టాల కింద విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
ఇందుకు సంబంధించి 2014లో డీజీపి రాసిన లేఖను అనుసరించి హోం శాఖ జీవో నెంబరు RT 611ను మే 26న విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ప్రభుత్వం వీరి ప్రాసిక్యూషన్ కు అనుమతించింది:
- అందే పాపయ్య గారి వెంకట రవీంద్ర అలియాస్ ఏపి వైన్స్ రవీంద్ర (ఏ1)
- సెట్టి శ్రీకాంత్ (ఏ2)
- అందే పెద కొండయ్యగారి మహేష్ అలియాస్ ఏపి వైన్స్ మహేష్ (ఏ3)
- భూమిరెడ్డి నాగప్ప గారి రామకృష్ణ అలియాస్ కిట్టు(ఏ4)
- దాసరి బాబు(ఏ5)
- దాసరి సత్యనారాయణ(ఏ6)
- తుపాకుల నరేంద్ర (ఏ7)
- దాసరి సతీష్(ఏ8)
- దాసరి వెంకటయ్య(ఏ9)
- దాసరి శ్రీనివాసులు(ఏ10)
- గవ్వల సుబ్బయ్య(ఏ11)
- గండుల బాబు అలియాస్ ముత్తులూరుపాడు బాబు(ఏ12)
- యాపరాల రాము అలియాస్ వెంకటాపురం రాము(ఏ13)
- ఎం వెంకటరమేష్(ఏ14)
- పి పెద్దయ్య అలియాస్ చిన్న సుబ్బరాయుడు(ఏ15)
- పి సురేష్బాబు(ఏ16)
- యాపరాల బాబు(ఏ17)
- యాపరాల ప్రసాద్(ఏ18)
- శీలం బుట్టగండ్ల శ్రీనివాసులు(ఏ19)
- సిద్దవటం రామచంద్రుడు అలియాస్ చిలకల చంద్ర(ఏ22)
- మేకా సురేష్(ఏ24)
- దాసరెడ్డి గారి సురేంద్ర అలియాస్ కూరగాయల సురేంద్ర(ఏ25)
- మేకల సుబ్బరాయుడు (ఏ26)
- మేకల చెన్నకేశవులు(ఏ27)
- పిడతల శంకర్(ఏ28)
- సీతా చైతన్య(ఏ29)
- వొట్టే బ్రహ్మయ్య(ఏ30)
- మాచనూరు సుబ్బారాయుడు(ఏ31)
- రేనాటి వెంకటసుబ్బయ్య(ఏ33)
- బురిగోల సుధీర్(ఏ34)
- సోముల సాయి(ఏ35)
- భూమిరెడ్డి మాధవ @ రాయల్ మాధవ(ఏ36)
- కుశెట్టి పరంధామ(ఏ39)
- బద్వేల్ సుబ్బారాయుడు(ఏ40)
- ధనపాల రవీంద్రశెట్టి (ఏ41)