తెలిసినఁ దెలియుఁడు తెలియనివారలు – అన్నమయ్య సంకీర్తన

తెలిసినఁ దెలియుఁడు తెలియనివారలు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
తెలిసినఁ దెలియుఁడు తెలియనివారలు
తొలఁగుఁడు బ్రహ్మదులె యెరుఁగుదురు
॥చ1॥
వరదుఁ డఖిలదేవలతకు వంద్యుఁడు
గరదుఁడసురలకుఁ గంటకుఁడు
పరమాత్ముఁడంబుజ భవశివాదులకుఁ
బరులకెల్ల మువ్వరలో నొకఁడు
॥చ2॥
దేవుఁడు సనకాదిమునులకునుఁ, బర-
దైవ మఖిలవేదములకును,
కైవల్యమొసఁగుఘననిధి, విధికిమ-
హవిధి, జడులకు యాదవకులుఁడు
॥చ3॥
ఆద్యుఁడచలుఁడు మహభూత మితఁడ-
భేధ్యుఁడ సాధ్యుఁడు భీకరుఁడు
సద్య: ఫలదుఁడు సకలమునులకును
వేద్యుఁడితఁడె పో వేంకటవిభుఁడు
రాగము: నాట
రేకు: 0062-02
సంపుటము: 1-317

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాట

చదవండి :  కాలము కాలము గాదు కపటాలే తఱచాయ - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: