తెలియక వూరక తిరిగేము – అన్నమయ్య సంకీర్తన

తెలియక వూరక తిరిగేము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
తెలియక వూరక తిరిగేము
చలమరి కగునా సంతతసుఖము
॥చ1॥
హేయము కడుపున నిడుకొని యింకా
‘చీ’ యనని మాకు సిగ్గేది
పాయము పిడికిటఁ బట్టుచునుండేటి
కాయధారులకుఁ గలదా విరతి
॥చ2॥
అంగనల రతుల యాసలనీఁదేటి
యెంగిలిమనుజుల కెగ్గేది
ముంగిట నార్గురుముచ్చులఁ గూడిన
దొంగగురుని కిందుల నిజమేది
॥చ3॥
జననమరణములు సరి గని కానని
మనుజాధమునకు మహిమేది
యెనగొని శ్రీవేంకటేశు శరణ మిటు
గని మనకుండిన గతి యిఁక నేది
రాగము: సామంతం
రేకు: 0088-04
సంపుటము: 1-432

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  ఇంతే మఱేమిలేదు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: