తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని
॥పల్లవి॥ తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని ఆపదలచేతఁ బొరలాడేముగాన ॥చ1॥ అప్పుదీరినదాఁకా నలవోకకైనవా- రెప్పుడునుఁ దమవార లేలౌదురు అప్పటప్పటికిఁ బ్రియ మనుభవింపుచు మమత చెప్పినటువలెఁ దాము సేయవలెఁ గాక ॥చ2॥ పొందైనవారమని పొద్దు వోకకుఁ దిరుగు- యిందరునుఁ దమవార లేలౌదురు కందువగు తమకార్యగతులు దీరినదాఁక సందడింపుచుఁ బ్రియము జరపవలెఁ గాక ॥చ3॥ తెగని కర్మముదమ్ముఁ దిప్పుకొని తిరిగాడ ఆగడుకోరిచి పెక్కులాడ నేమిటికి తగవేంకటేశ్వరునిఁ దలఁచి యిన్నిటాఁ దాము విగతభయులయి భ్రాంతి విడువవలెఁ గాక | రాగము: బౌళి రేకు: 0006-04 సంపుటము: 1-39 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళి