తలపోఁత బాఁతె తలఁపులకుఁ దమ
॥పల్లవి॥ తలపోఁత బాఁతె తలఁపులకుఁ దమ కొలఁ దెఱంగనిమతి గోడాడఁగా wat kost de pil ॥చ1॥ ఆపదలు బాఁతె అందరికినిఁ దమ- చాపలపు సంపదలు సడిఁబెట్టఁగా పాపములు బాఁతె ప్రాణులకును మతిఁ బాపరానియాస దమ్ముఁ బాధించఁగా ॥చ2॥ జగడాలు బాఁతె జనులకునుఁ దమ- పగలైనకోపాలు పై కొనఁగా వగలు బాఁతె వలలఁ బెట్టెడి తమ్ముఁ దగిలించు మమత వేదనము సేయఁగా ॥చ3॥ భయములు బాఁతె పరులకును తమ- దయలేక అలయించు ధనముండఁగా జయములు బాఁతె సతతమును యింత- నయగారివేంకటనాథుఁ డుండఁగాను |
రాగము: శంకరాభరణం రేకు: 0006-06 సంపుటము: 1-41 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శంకరాభరణం