తప్పదు తప్పదు దైవము కృపయిది – అన్నమయ్య సంకీర్తన

తప్పదు తప్పదు దైవము కృపయిది – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
తప్పదు తప్పదు దైవము కృపయిది
ముప్పిరి నింతా ముకుందుఁడే
॥చ1॥
వెక్కసపుమతి వెలుతురుదీరిన-
నెక్కడ చూచిన నీశ్వరుఁడే
గుక్కక యాసలు గోసివేసినను
నిక్క మడుగడుగు నిధానమే
॥చ2॥
పొంచి శరీరపుభోగము లుడిగిన
చుంచుఁబావములు సుకృతములే
దంచెడివిషయపుతగులమిఁ బాసిన
యెంచిచూచినను యీహమే పరము
॥చ3॥
శ్రీవేంకటపతిసేవే కలిగిన
వేవేలువగలు వేడుకలే
చేవదీరె సందియము లేదిదే
భావము నమ్మిన ప్రసన్నులకును
రాగము: లలిత
రేకు: 0078-02
సంపుటము: 1-371

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత

చదవండి :  పరదేశిపట్టణమున పదుగురునేగురుఁ గూడుక

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: