అన్నమయ్య సంకీర్తనలలో పెద్దముడియం నృసింహుడు
రాగము: సాళంగనాట
రేకు: 0324-1
సంపుటము: 11-139
॥పల్లవి॥ జయమాయ నీకు నాపె సరసములూ
నయగారి ముడుయము నారసింహా
॥చ1॥మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి
కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది
ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ
నామాట విని యిట్టె నారసింహా
॥చ2॥మన్నన నీ యలుకల మంకు దెలవ వలసి
చన్ను లురమునఁ బెట్టి సత మైనది
చెన్నుఁడ వాపె చనవు చెల్లించ వయ్య యిట్టె
న న్నడిగే దింకా నేమి నారసింహా
॥పల్లవి॥జయ మాయ నీకు నాపె సరసములూ
నయగారి ముడుయము నారసింహా
॥చ1॥మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి
కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది
ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ
నామాట విని యిట్టె నారసింహా
॥చ2॥మన్నన నీ యలుకల మంకు దెలవ వలసి
చన్ను లురమునఁ బెట్టి సత మైనది
చెన్నుఁడ వాపె చనవు చెల్లించ వయ్య యిట్టె
న న్నడిగే దింకా నేమి నారసింహా
॥చ3॥చేతుల నిన్ను నలమి చెక్కుఁ జెక్కుఁ గదియించి
నీతితో నీ మెడసొమ్మై నెలకొన్నది
యీతల శ్రీవెంకటాద్రి నెనసితి వాపెతోడ
నా తలఁపు లీడేరించి నారసింహా
॥చ3॥చేతుల నిన్ను నలమి చెక్కుఁ జెక్కుఁ గదియించి
నీతితో నీ మెడసొమ్మై నెలకొన్నది
యీతల శ్రీవెంకటాద్రి నెనసితి వాపెతోడ
నా తలఁపు లీడేరించి నారసింహా