
జమ్మలమడుగులో ఎవరికెన్ని ఓట్లు?
జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల తిరస్కరణ మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుదిపోరులో తలపడ్డారు. ఈ పోరులో వైకాపా తరపున బరిలోకి దిగిన చదిపిరాల్ల ఆదినారాయణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డిపై సుమారు 12వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఆదినారాయణరెడ్డి చదిపిరాళ్ల – వైకాపా – 100794
రామసుబ్బారెడ్డి పొన్నపురెడ్డి – తెదేపా+భాజపా – 88627
బ్రహ్మానందరెడ్డి పాముల – కాంగ్రెస్ – 1899
శ్రీనివాసులు తుమ్ములూరు – బసపా – 1381
శివనాధరెడ్డి చదిపిరాళ్ల – నేకాపా – 852
నారాయణరెడ్డి కందుల – పిరమిడ్ పార్టీ -608
రామకృష్ణారెడ్డి లక్కిరెడ్డి – జైసపా – 388
విజయ శేఖర్ జకట – వైఎస్సార్ ప్రజా పార్టీ – 385
షేక్ సమీరా – ఆమాద్మీ – 234
మునిసుబ్బారెడ్డి ఉండేల – స్వతంత్ర అభ్యర్థి – 221
జాని ముల్లా – ఫార్వర్డ్ బ్లాక్ – 139
చిన్న సంజీవరెడ్డి బాపతి – జెడియు – 132
నోటా – 756