
చెల్లుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి –
॥పల్లవి॥ చెల్లుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి – పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు ॥చ1॥ చెలఁగి నే మునుసేసినచేఁత లుండఁగా మలసి నేఁ దిరుగుతిమ్మట లుండఁగా తొలఁగఁదోసి తప్పుడుతోడనే లోహంబు వెలయ బంగారుగావించినగతిని ॥చ2॥ బిగిసి నామైనున్న పెనుకట్లుండఁగా జగడగాండ్లు పగచాటఁగను జిగిగలచేఁతిముసిఁడికాయయగునన్ను మొగిఁ గల్పకము ఫలముగఁ జేయవసమా ॥చ3॥ పొదిలిన యింద్రియంబులు వెంట రాఁగా మదివికారము నే మరుగఁగానే వదలకు వేంకటేశ్వర నన్ను నిదే నీ – పదపంకజములు చేర్పఁగ నిది వసమా |
రాగము: ఆహిరి రేకు: 0030-01 సంపుటము: 1-182 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరి