
చెప్పుడుమాటలే చెప్పకొనుటగాక – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ చెప్పుడుమాటలే చెప్పకొనుటగాక చెప్పినట్లఁ దాము నేయ రెవ్వరును ॥చ1॥ దొడ్డయినశరీరదోషమైనయట్టి జడ్డు దొలఁగవేయఁజాల రెవ్వరును గడ్డబడి యీఁతకాండ్లౌటగాని వొడ్డునడుమ నీఁద నోపరెవ్వరును ॥చ2॥ శ్రీవేంకటేశుపైఁ జిత్త మర్పణ నేసి యీవిధు లన్నియు నెడయ రెవ్వరును చావుఁ బుట్టగులేని జన్మముగలసర్వ.- దేవతామూర్తులై తిరుగ రెవ్వరును |
రాగము: దేవగాంధారి రేకు: 0037-04 సంపుటము: 1-230 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి