
చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడో – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడో వొత్తిన యీచేఁత లొకరివి గావు ॥చ1॥ పదిలమైన మోహపాశంబులు దెచ్చి మెదలకుండఁగ నాకు మెడఁజుట్టి యెదిరివారు నవ్వ నింటింటఁ దిరిగించి తుదలేని యాసల దు: ఖాతురునిఁ జేసె ॥చ2॥ కొలఁదిమీఱ జన్మకోట్లఁ బెనగొని తొలఁగని నాలోని దురితము తొలఁగింప నాలుక తుదకు నీపేరిచ్చి తెలుపు మింతియ చాలుఁ దిరువేంకటేశా |
రాగము: బౌళి రేకు: 0050-06 సంపుటము: 1-309 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి