
చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి
॥పల్లవి॥ చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి వేవేలు దురితముల వేగించు టొండె is-aber.net ॥చ1॥ కనుఁగొనల నిరుమేను గాఁడిపారుట లొండె చనుఁగొండలను మహచరులఁ బడు టొండె తనివోని సురతములఁ దగిలి మునుఁగుట యొండె ఘనమోహబంధములఁ గట్టువడు టొండె ॥చ2॥ మొనసి యాశాపాశములయురులఁ బడు టొండె కనలి పొలయలుకచేఁ గాఁగు టది యొండె మనసు కాఁతాళమును మల్లువెనఁగుట లొండె పనిలేని మదనాగ్నిఁ బడి పొరలు టొండె ॥చ3॥ తడసి మమతల నిరంతర దైన్యమది యొండె నడుమనే కన్నుగానక తిరుగు టొండె యెడప కీతిరువేంకటేశుఁ దలఁపఁగలేక పడని పాట్లనెల్లఁ బడి వేఁగు టొండె |
రాగము: శ్రీరాగం రేకు: 0026-02 సంపుటము: 1-157 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం