
చాలదా మా జన్మము నీ-
॥పల్లవి॥ చాలదా మా జన్మము నీ- పాలింటివారమై బ్రతుకఁగఁ గలిగె open ॥చ1॥ కమలాసనాదులు గానని నీపై మమకారము సేయ మార్గము గలిగె అమరేంద్రాదుల కందరాని నీ- కొమరైన నామము కొనియాడఁ గలిగె ॥చ2॥ సనకాదులును గానఁజాలని నిన్నుఁ తనివోవ మతిలోనఁ దలపోయఁ గలిగె ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న- నిను సంతతమును వర్ణింపఁగలిగె ॥చ3॥ పరమమై భవ్యమై పరిగిననీ- యిరవిట్టిదని మాకు నెఱుఁగంగఁ గలిగె తిరువేంకటాచలాధిప నిన్ను యీ- ధరమీఁదఁ బలుమారు దరిసింపఁ గలిగె |
రాగము: సామంతం రేకు: 0018-04 సంపుటము: 1-110 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం