చదువులోనే హరిని జట్టిగొనవలెఁగాక – అన్నమయ్య సంకీర్తన

చదువులోనే హరిని జట్టిగొనవలెఁగాక – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
చదువులోనే హరిని జట్టిగొనవలెఁగాక
మదముగప్పినమీద మగుడ నది గలదా
॥చ1॥
జడమతికి సహజమే సంసాయాతన యిది
కడు నిందులోఁ బరము గడియించవలెఁగాక
తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను
విడిచి మఱచిన వెనక వెదకితేఁ గలదా
॥చ2॥
భవబంధునకు విధిపాపపుణ్యపులంకె
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెఁగాక
అవల వెన్నెలోనె అల్లు నేరేళ్లింతే
నివిరి నిన్నటివునికి నేఁటికిఁ గలదా
॥చ3॥
దేహధారికిఁ గలదే తెగనియింద్రియబాధ
సాహసంబున భక్తి సాధించవలెఁగాక
యీహలను శ్రీవేంకటేశుదాసులవలన
వూహించి గతిగానక వొదిఁగితేఁ గలదా
రాగము: మాళవిగౌళ
రేకు: 0091-03
సంపుటము: 1-449

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మాళవిగౌళ

చదవండి :  అభయమభయమో హరి నీకు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: