కుడుచుఁగాక తనకొలఁదిగాని మేలు

కుడుచుఁగాక తనకొలఁదిగాని మేలు

॥పల్లవి॥
కుడుచుఁగాక తనకొలఁదిగాని మేలు
దడవీనా నోరు తగినయెంతయును
॥చ1॥
చంపవచ్చిన కర్మసంగ్రహంబగు బుద్ది
గంప గమ్మక తన్ను గాచీనా
పంపుడుదయ్యమై బాధఁ బెట్టెడుయాస
కొంపలోన నుండనీఁగోరీనా
॥చ2॥
శ్రీవేంకటగిరి శ్రీనాథుఁ డిందరిఁ
గావఁబ్రోవఁగ నున్నఘనుఁడు
దేవోత్తముని నాత్మఁ దెలియ కితరములయిన-
త్రోవ లెన్నిన మేలు దొరకీనా
రాగము: రామక్రియ
రేకు: 0030-06
సంపుటము: 1-187

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, రామక్రియ

చదవండి :  కాయము జీవుఁడుగలనాఁడే తెలియవలె - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: