కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_
॥పల్లవి॥ కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_ కీలువదలె సౌజన్యము కిందయిపోయినది lisinopril and driving lisinopriland.net lisinopril and driving ॥చ1॥ ఇందెక్కడిసంసారం, బేదెసఁ జూచిన ధర్మము కందయినది,విజ్ఞానము కడకుఁ దొలంగినది, గొందులు దరిఁబడె, శాంతము కొంచెంబాయ,వివేకము మందుకు వెదకినఁ గానము మంచితనంపుఁబనులు ॥చ2॥ మఱి యిఁక నేఁటివిచారము, మాలిన్యంబైపోయిన_ వెఱుకలు, సంతోషమునకు నెడమే లేదాయ, కొఱమాలెను నిజమంతయు,కొండలకేఁగెను సత్యము, మఱఁగైపోయను వినుకులు, మతిమాలెను తెలివి ॥చ3॥ తమకిఁక నెక్కడిబ్రదుకులు, తడఁబడె నాచారంబులు, సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు , తిమిరంబింతయుఁ బాపఁగఁ దిరువేంకటగిరిలక్ష్మీ- రమణుఁడు గతిదప్పను కలరచనేమియు లేదు |
రాగము: సామంతం రేకు: 0010-03 సంపుటము: 1-63 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం