
కాయము జీవుఁడుగలనాఁడే తెలియవలె – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కాయము జీవుఁడుగలనాఁడే తెలియవలె యీయత్నములు దనకెన్నఁడు ॥చ1॥ సతతము సంసారజడుఁడు దానట యాత్మ- హితవు దెలుసుకాల మెన్నఁడు రతిసరసముల పూరకే ప్రాయ మెడలంగ యితరసుఖము దన కెన్నఁడు ॥చ2॥ యెడపక ద్రవ్యమెహితుఁడై తిరుగఁ దన.- యిడుమపాటు మాను టెన్నఁడు కడలేనిపొలయలుకలచేతఁ దనదేహ- మిడియఁగ నిజసుఖ మెన్నఁడు ॥చ3॥ శ్రీవేంకటేశునిఁ జేరి తక్కినసుఖ- మేవగించుకాల మెన్నఁడు శ్రీవల్లభునికృప సిరిగాఁ దలఁచి జీవుఁ – డీవైభవముఁ గాంచు టెన్నఁడు |
రాగము: నాట రేకు: 0068-01 సంపుటము: 1-352 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాట