
కాయమనేవూరికి గంతలు తొమ్మిదియాయ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కాయమనేవూరికి గంతలు తొమ్మిదియాయ పాయక తిరిగాడేరు పాపపుతలారులు ॥చ1॥ కాముఁడనియెడిరాజు గద్దెమీఁద నుండఁగాను దీము గోపపుప్రధాని దిక్కు లేలీని కోమలపుజ్ఞానమెల్లాఁ గొల్లఁబోయ నాడనాడ గామిడులై రింద్రియపుఁగాపులెల్లా నిదివో ॥చ2॥ చిత్తమనేదళవాయి చింతలనేపౌఁజు వెట్టి యిత్తలవిషయములు యెన్నికిచ్చిరి తుత్తుము రైకోరికెల దొండెము రేఁగఁగఁజొచ్చె జొత్తుల వెరగుపడిచూచీఁ బుట్టుగులు ॥చ3॥ బలుసంసారమనేటిభండారము ఘనమాయ కలదీగి జవ్వనపుకై జీతము యిలలో శ్రీవేంకటేశుఁడింతలో జీవుఁడనేటి బలువుని రాజుఁజేసి పాలించె నన్నును |
రాగము: బౌళి రేకు: 0097-06 సంపుటము: 1-488 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి