
కాక మరి యింతేల కలుగుఁ దమకేతముకు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కాక మరి యింతేల కలుగుఁ దమకేతముకు చేకొన్న కోరికలు చేరు నందాఁకా ॥చ1॥ దొరతనములన్నియును దొరసి నందాఁకా నెరతనములన్నియును నెరపి నందాఁకా గరగరికలన్నియును కలసి నందాఁకా విరసంబులన్నియును విసుగు నందాఁకా ॥చ2॥ యెడమాటలన్నియును యెరసి నందాఁకా అడియాసకోరికలు అదుకు నందాఁకా జడిగొన్నగుక్కిళ్లు చవిగొన్నయందాఁక వొడ లోముటలు మోహ ముడుగు నందాఁకా ॥చ3॥ యీ వెల్లఁ దమయాత్మ యిచ్చగించినదాఁక శ్రీవేంకటేశుకృప చేరు నందాఁక లోవెలుతున్నియును లోఁగొన్నయందాఁక వేవేగ బంధములు వీడు నందాఁకా |
రాగము: ఆహరి రేకు: 0041-01 సంపుటము: 1-249 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహరి