బంధించేందుకు రంగం సిద్ధం

బంధించేందుకు రంగం సిద్ధం

లంకమల్ల అభయారణ్యంలోని రెడ్డిపల్లె, కొండూరు గ్రామాల సమీపంలో కలివికోడి కదలికలను ఫొటోలలో బందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం లంకమల పరిసరాలలో 54 నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వైల్డ్‌లైఫ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జోసఫ్ తెలిపా రు.

మంగళవారం రెడ్డిపల్లె సమీప అడవిలో ఇటీవల ఏర్పాటు చేసిన ని ఘా కెమెరాలను పరిశీలించేందుకు ఆయనతో పాటు చీఫ్ కన్సర్‌వైటర్ డీఎఫ్‌వో శివాణి డోగ్రాలు వచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్ర పంచంలోనే అంతరించిపోయిందనుకున్న కలివి కోడి అట్లూరు మండ లంలో ఉండడం సంతోషకరమన్నా రు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ శాస్త్రవేత్త జగన్నాధం ఆధ్వర్యంలో 2009లో కలివి కోడి ఉన్నట్లు కొన్ని ఆధారాల ద్వారా గుర్తించారన్నా రు.

చదవండి :  కడపలో హీరో వెంకటేష్

ఈ క్రమంలో కలివి కోడి ఉనికిని గుర్తించేందుకు ఒక్కొక్క నిఘా కెమెరా సుమారు రూ.25 వేలతో 54 కెమెరాల ను ఏర్పాటు చేశామన్నారు. ఆయా కెమెరాల్లో 40రోజులకోసారి పక్షులు, జంతువుల కదలికలను నిక్షిప్తమైన ఫొ టోలను డౌన్‌లోడు చేస్తామని వివరించారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *