కలమళ్ళ శాసనము

inscription

1. …..

2. క ల్ము తు రా

3. జు ధనంజ

4. యుదు రేనా

5. ణ్డు ఏళన్

6. చిఱుంబూరి

7. రేవణకాలు

8. పు చెనూరుకాజు

9. అఱి కళా ఊరి

10. ణ్డ వారు ఊరి

11.

12.

13.

14.

15.

16. హాపాతకస

17. కు. 16

‘ఎరికల్ ముతురాజు’అనేబిరుదుగల ధనంజయుడను రాజు రేవాణ్డు ఏలుచుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనుపేరుగల ‘కాలు’ ఒక ఉద్యోగి(లేక ఆసామి) యొక్క పంపున చెనూరి గ్రామానికి చెందిన ‘కాజు… … … … ‘అని వాక్యమసంపూర్తిగా వున్నది. తుదిలో పంచమహాపాతకుడగునని యీ ధర్మమును చెడగొట్టువారికి పాపము చెప్పబడెను.ఈ శాసనములో భాషా విషయకముగ విశేషములు తెలుసుకొను అవకాశ మంతగా లేదు.

చదవండి :  బుడ్డాయపల్లె శాసనము

ఎరికల్ అను నగరము వీరికొకప్పుడు రాజధాని యగుటనుబట్టి యీ రాజులలో కొందరికి ఎరికల్ ముతురాజు, ఎరిగల్ దుగరాజు అను రాజబిరుదము లుండెడివని దీనిని ప్రకటించిన కీ.శే. ముట్లూరి వెంకటరామయ్యగారు, ప్రొఫెసరు కె.ఎ.నీలకంఠ శాస్త్రిగారు చెప్పిరి.మహారాజు, మహా రాజాధిరాజు, యువరాజు, (దుగరాజు) అనుపదములు రాజపవులలో ప్రభేదములను తెలుపునట్లే ముత్తురాజు పదముకూడ నొక భేదమును తెలుపునని వారుచెప్పిరి.

– జి. పరబ్రహ్మశాస్త్రి

(సౌజన్యం:తెలుగు శాసనాలు, అం.ప్ర సాహిత్య అకాడెమీ వారి ప్రచురణ)

చదవండి :  తెలుగు శాసనాలు

ఇదీ చదవండి!

మాలెపాడు శాసనము

దానవులపాడు శాసనాలు

జమ్మలమడుగు తాలూకాలోని దానవులపాడులో రాములోరి గుడిలో రాతి స్తంభాల మీదున్న శాసనాలివి… ఒక స్థంభం మీదున్న ఈ క్రింది శాసనం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: