కనుఁగొనఁగ జీవుఁ డెరఁగఁడుగాక యెరిఁగినను – అన్నమయ్య సంకీర్తన

కనుఁగొనఁగ జీవుఁ డెరఁగఁడుగాక యెరిఁగినను – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
కనుఁగొనఁగ జీవుఁ డెరఁగఁడుగాక యెరిఁగినను
ఆనవరతవిభవంబు లప్పుడే రావా
॥చ1॥
విసుగ కెవ్వరినైన వేఁడనేర్చన నోరు
దెసలకును బలుమారుఁ దెరచు నోరు
వసుధాకళత్రుఁ దడవదుగాక తడవినను
యెసఁగఁ గోరికలు తన కిప్పుడే రావా
॥చ2॥
ముదమంది యెవ్వరికి మ్రొక్కనేర్చిన చేయి
పొదిగి యధముల నడుగఁబూను చేయి
ఆదన హరిఁ బూజసేయదుగాక సేసినను
యెదురెదురఁ గోరికలు యిప్పుడే రావా
॥చ3॥
తడయకేమిటికైనఁ దమకమందెడి మనసు
ఆడరి యేమిటికైన నలయు మనసు
వడి వేంకటేశుఁ గొలువదుగాక కొలిచినను
బడిబడినె చెడనిసంపద లిట్లు రావా
రాగము: శ్రీరాగం
రేకు: 0062-04
సంపుటము: 1-319

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: