ఆదివారం , 22 డిసెంబర్ 2024
రాయలసీమ రైళ్ళు

నాలుగు కొత్త రైళ్ళూ – నలభై రోజులూ…

హెడ్డింగు చూసి ఆశ్చర్యపోయే ముందు కాస్త నిభాయించుకోండి. ఎందుకంటే రైల్వే మంత్రి ఖార్గే గారడీ చేసి బడ్జెట్ ను తియ్యగా కనిపించేట్లు చేశారు. నిజం చెప్పాలంటే రైల్వే బడ్జెట్ విషయంలో జిల్లాకు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. జిల్లా మీదుగా నాలుగు రైళ్ళు నడవనున్నా అవి సగటున సంవత్సరానికి కేవలం 42 రోజులు మాత్రమే నడుస్తాయి. అంటే సంవత్సరమంతా కలిపి కేవలం ఒకటిన్నర నెల రోజులు మాత్రమే మనకు ఈ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. నాలుగు రైళ్ళని నవ్వాలా? నలభై రోజులు  మాత్రమే అందుబాటులో ఉంటాయని బాధపడాలా? నాలుగు రైళ్ళూ – నలభై రోజులూ… జిల్లా మీదుగా నడవడం కొంతలో కొంత ఉపశమనమే! ఎందుకంటే గుడ్డి కన్నా మెల్ల మేలేగా!!

చదవండి :  కడప జిల్లాలో కులాల పేర్లు కలిగిన ఊర్లు

రాయలసీమ నుంచి ప్రాతనిథ్యం వహిస్తున్న మాటలను కోటలు దాటించే రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి హామీలు నీటిమూటలే అయ్యాయి.

      • కాచిగూడ- తిరుపతి డబుల్‌డెక్కర్ రైలును రెండు వారాలకు ఒకసారి జిల్లా మీదుగా నడిపించనున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా రెండు డబుల్ డెక్కర్ రైళ్ళు ప్రవేశపెడుతుండగా వీటిలో కాచిగూడ – తిరుపతి ఒకటి.
      • కాచిగూడ-నాగర్‌కోయిల్ ల మధ్య వారానికి ఒకసారి నడిచే రైలును ప్రవేశపెట్టనున్నారు. ఇది కరూర్ ,నామక్కల్, సేలం, కడప ల మీదుగా నడవనుంది.
      • ముంబయి-చెన్నై మధ్య వారానికి ఒకసారి తిరిగే ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇదికూడా కడప మీదుగా ప్రయాణించనుంది. త్వరలోవీటికి సంబంధించిన వివరాలు రైల్వేశాఖ నుంచి వెల్లడయ్యే అవకాశం ఉంది.
      • వేసవి ప్రత్యేక రోజుల్లో మాత్రమే  వెళ్లే రేణిగుంట-ఔరంగాబాద్ రైలు ఇక వారానికి ఓరోజు మన కడప మీదుగా వెళ్లనుంది.
చదవండి :  బ్రహ్మంగారిమఠంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

బడ్జెట్‌లో నందలూరు రైల్వేపరిశ్రమ ఊసేఎత్తలేదు. కొత్త మార్గాల గురించి కానీ.. ప్రతిపాదనలో ఉన్న పొడిగింపు రైళ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదు.

కాచిగూడ- మంగళూరు, చెన్నై-నాగర్‌సోల్, బనగానపల్లె-ఎర్రగుంట్ల రైళ్లు బడ్జెట్ కాగితాల్లోనే ఉండిపోయాయి.

కడప-బెంగళూరు, కృష్ణపట్నం-ఓబులవారిపల్లె, ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గాలకు మళ్లీ అరకొర నిధులే కేటాయించారు. దీంతో ఈ రైలు మార్గాల నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగుతునే ఉంది.

రైల్వేశాఖా మంత్రి మల్లికార్జున ఖర్గే గందరగోళం మధ్య బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు కనీస న్యాయం జరగలేదు.

చదవండి :  'వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి': కలెక్టర్

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: