14న కడపకు రాఘవులు

సీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ‘రాష్ట్ర విభజన, జిల్లా అభివృద్ధి’ అన్న అంశంపై ఈనెల 14న కడపలో నిర్వహించతలపెట్టిన సెమినార్‌కు సంబంధించిన గోడపత్రాలను ఆయన విడుదలచేశారు.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గురువారం ఆర్జీయూ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా సీమ అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ప్రత్యేకించి జిల్లాలో కరవు, నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నట్టు చెప్పారు. సమస్య పరిష్కారానికి కృష్ణా జలాల తరలింపు, ఉక్కు పరిశ్రమ వంటివి ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

చదవండి :  జగన్ కే ఓటు వేసిన వివేకా భార్య ?

జిల్లా అభివృద్ధి అంశంపై ఈనెల 14న కడపలో నిర్వహించే సెమినార్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు హాజరవుతున్నారన్నారు. ఆర్జీయూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రోజర్‌బిన్ని, రామకృష్ణ, ఖాదర్, రాధాకృష్ణ, సీఐటీయూ ప్రతినిధి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: