
27న కడపకు చంద్రబాబు
27న కడపలో ప్రజాగర్జన నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో 27న ప్రజాగర్జన నిర్వహించడం వల్ల ఎన్నికల్లో లాభిస్తుందని తెదేపా నేతలు భావిస్తున్నారు.
చంద్రబాబు హాజరయ్యే గర్జనకు భారీ ఎత్తున జన సమీకరణ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాగర్జన సభలో చేరతారా, లేక అంతకుముందే సైకిలెక్కుతారా అన్నది తెలియాల్సి ఉంది.