
కటకటా దేహంబు గాసిఁబెట్టఁగ వలనె
॥పల్లవి॥ కటకటా దేహంబు గాసిఁబెట్టఁగ వలనె నిటువంటి దెసలచే నిట్లుండవలనె open ॥చ1॥ చంపనొల్లక కదా సంసారమనియెడి- గంపమోఁపు గడించె కర్మసంగ్రహము లంపటము విరియించ లావుచాలక తుదిని దింప నొకకొంతైన తెగుదెంపులేదు ॥చ2॥ మనుపనోపకకదా మాయవిలంబమున కనుమూసి కాంక్ష మఱి కట్టె దైవంబు దినభోగములు విడువఁ దెఱఁ గేమిటను లేక తనివిఁబొందించ నెంతయు వసముగాదు ॥చ3॥ తెలుపనోపకకదా తిరువేంకటేశ్వరుఁడు వెలలేనివేదనల వేఁచెఁ బ్రాణులను బలిమి నజ్ఞానంబుఁ బాయలే కితనినే తలఁచి భవబంధముల దాఁటంగరాదు |
రాగము: కన్నడగౌళ రేకు: 0029-03 సంపుటము: 1-178 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, కన్నడగౌళ