
కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు ॥చ1॥ మేఁటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు గాఁటపువిజ్ఞానముకంటే సుఖము లేదు మీఁటైనగురువుకంటే మీఁద రక్షకుఁడు లేఁడు బాటసంసారముకంటే పగ లేదు ॥చ2॥ పరపీడ సేయుకంటే పాపము మరెందు లేదు పరోపకారముకంటే బహుపుణ్యము లేదు నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు హరిదాసుడౌకంటే నట గతి లేదు ॥చ3॥ కర్మసంగము మానుకంటే దేజము లేదు అర్మిలిఁ గోరికమానేయంతకంటే బుద్ధి లేదు ధర్మపుశ్రీవేంకటేశుఁ దగిలి శరణుచొచ్చి నిర్మలాన నుండుకంటే నిశ్చయము లేదు |
రాగము: సామంతం రేకు: 0090-03 సంపుటము: 1-443 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం