
ఒంటిమిట్ట కోదండ రామాలయం
ఒంటిమిట్టకు ఎలా చేరుకోవచ్చు?
ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కోదండ రామాలయం ఉంది.
వివిధ మార్గాలలో ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు…
రోడ్డు మార్గంలో…
బస్సు ద్వారా…
దగ్గరి బస్ స్టేషన్: కడప (27 KM), రాజంపేట (29 KM)
కడప, రాజంపేటల నుంచి ప్రతి పది నిమిషాలకు ఒంటిమిట్ట మీదుగా వెళ్ళే బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే కడప, రాజంపేట మార్గంలో ప్రయివేటు ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి.
ప్రయివేటు వాహనాలలో…
హైదరాబాదు వైపు నుండి : హైదరాబాదు –> కర్నూలు –> కడప –> ఒంటిమిట్ట
విజయవాడ వైపు నుండి : విజయవాడ –> కడప –> ఒంటిమిట్ట
చెన్నై వైపు నుండి : చెన్నై –> రేణిగుంట –> రాజంపేట –> తాళ్ళపాక –> ఒంటిమిట్ట
తిరుపతి వైపు నుండి: తిరుపతి –> రేణిగుంట –> రాజంపేట –> తాళ్ళపాక –> ఒంటిమిట్ట
బెంగుళూరు వైపు నుండి: బెంగుళూరు –> మదనపల్లి –> రాయచోటి –> కడప –> ఒంటిమిట్ట
రైలు మార్గంలో:
దగ్గరి రైల్వే స్టేషన్: ఒంటిమిట్ట (1 KM), కడప(27 KM), రాజంపేట(29 KM)
వాయుమార్గంలో…
దగ్గరి విమానాశ్రయం : కడప(33 KM), తిరుపతి(111 KM), చెన్నై(250 KM), బెంగుళూరు(262 KM), హైదరాబాదు(423 KM)
హైదరాబాదు, విజయవాడ, బెంగుళూరు వైపు నుండి వచ్చే వారు కడపకు రిజర్వేషన్ చేసుకుని అక్కడి నుంచి ఒంటిమిట్ట చేరుకోవచ్చు. బస చేయటానికి కడప నగరంలో త్రీస్టార్ సౌకర్యాలు కలిగిన లాడ్జీలు, హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి.
చెన్నయ్, తిరుపతి వైపు నుండి వచ్చేవారు రాజంపేట వరకు రిజర్వేషన్ చేసుకుని అక్కడి నుండి ఒంటిమిట్ట చేరుకోవచ్చు. బస చేయటానికి రాజంపేట పట్టణంలో రెండుచుక్కల సౌకర్యాలు కలిగిన లాడ్జీలు, హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి.